జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పశ్చిమ బెంగాల్ సిఎంని హతమార్చే ఉద్దేశం లేదు: దీపక్ (West Bengal | CM | Buddhadeb | Telugug Deepak | Maoists | Canvoy | LTTE | Tamilanadu | CID)
Bookmark and Share Feedback Print
 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను హతమార్చే ఉద్దేశం తమకు లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌ జీకి అత్యంత నమ్మకస్తుడైన నేత తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.

మావోయిస్టు నాయకుడు తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డిని ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీసుల అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అతనిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇందులో భాంగగా అతను తెలిపిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలావున్నాయి.

2008లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ కాన్వాయ్‌‍పై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. తమకు ఉద్దేశం ఉంటే బుద్ధదేవ్‌ను చంపి ఉండేవారమని, బుద్ధదేవ్ కాన్వాయ్‌పై హైటెన్షన్ వైర్ పడేలా డైరెక్షనల్ మైన్ పేల్చామని ఆయన తమ విచారణలో చెప్పినట్లు రాష్ట్ర సిఐడి అధికారులు తెలిపారు.

పోలీసులు తప్పుగా అర్థం చేసుకుని గిరిజనులపై దాడి చేయాలని తాము భావించామని, అదే వారు చేశారని, తద్వారా తాము పునాదిని ఏర్పరచుకోవడానికి వీలైందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై దాడి చేయడం తమ ఉద్యమంలో ఓ మైలు రాయి మాత్రమేనని ఆయన అన్నట్లు సిఐడి అధికారులు పేర్కొన్నారు.

తమిళనాడులోని ఎల్టీటీఇ గ్రూపు నుంచి తాను మందుపాతరలు తయారు చేయడం నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. వెంకటేశ్వర రెడ్డిని 1987 నుంచి 1995 వరకు మావోయిస్టు నాయకత్వం తమిళనాడుకు పంపింది. ఆ తర్వాత దీపక్ లీథల్ డైరెక్షనల్ ల్యాండ్ మైన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాడని అధికార వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.