అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నివశించే కొండజాతి తెగ పూర్తిగా అంతరించి పోతోంది. దీంతో ఈ తెగను పరిరక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ తెగ నివశించే ప్రాంతాల్లో పర్యాటకుల సందర్శనను నిషేధించింది. అండమాన్ దీవుల్లోని దక్షిణ ప్రాంతంలో ఐవరా అనే కొండజాతి ప్రజలు దశాబ్దాల కాలంగా జీవిస్తున్నారు.
అటవీ ప్రాంతంలో ఉండే అడవి పందులు, ఇతర క్రూర జంతువులను వేటాడి చంపి వాటిని ఆహారంగా తీసుకోవడం వీరి అలవాటు. 65 సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశాల నుంచి అండమాన్ దీవులకు తరలి వచ్చిన వీరి పూర్వీకులు ఈ దీవుల్లో స్థిరపడిపోయారు. గత 20 దశాబ్దాల క్రితం వరకు ఐవరా తెగ ప్రజలు అధిక సంఖ్యలో ఉండేవారు.
అటవీ ప్రాంతంలో గుంపులు గుంపులుగా వీరు నివశిస్తుంటారు. విచిత్ర వేషాధారణ, జీవన శైలితో జీవించే ఈ తెగ ప్రజలను చూసేందుకు పర్యాటకులు అండమాన్ దీవులకు అధిక సంఖ్యలో వెళుతుంటారు. పర్యాటకుల రాకతో ఈ తెగ ప్రజలు మరో ప్రాంతానికి తరలి వెళుతున్నారు.
ఫలితంగా ఈ తెగ ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిపోతంది. దీంతో వీరిని రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఐవరా తెగ ప్రజలు నివశించే ప్రాంతాల్లో పర్యాటకుల సందర్శనను నిషేధించింది.