జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఈనెల 19వ తేదీ నుంచి తమిళనాడు బడ్జెట్ సమావేశాలు (Tamilanadu | Budget sessions | Karunanidhi | Secretariat | National)
Bookmark and Share Feedback Print
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 19వ తేదీ నుంచి జరుగనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి తెలిపారు. ఈ సమావేశాలు కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవన సముదాయంలో జరుగుతాయని ఆయన చెప్పారు.

కాగా, 400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అసెంబ్లీ భవనాలను ఈనెల 13వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించిన విషయం తెల్సిందే. నిర్మాణ చివరి దశ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్ సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఇందులోనే 2010-11 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి కె.అన్బళగన్ దాఖలు చేస్తారని తెలిపారు.

బడ్జెట్ ప్రారంభ తేదీకి మరో మూడు రోజులు మాత్రమే ఉందని, అప్పటికి అసెంబ్లీ సమావేశాల ప్రాంగణం పూర్తిగా సిద్ధమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సభలో కుర్చీల ఏర్పాటుపై అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా కూర్చొనేలా సభలో సీట్లు అమర్చుతున్నట్టు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.