జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భాజపా జాతీయ కార్యవర్గాన్ని విస్తరించిన నితిన్ గడ్కారీ (Nitin Gadkari | BJP new team | Varun | Sidhu | National)
Bookmark and Share Feedback Print
 
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం విస్తరణలో గత మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠతకు ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెరదించారు. తన కొత్త పరివారాన్ని ఆయన మంగళవారం విస్తరించారు. 13 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా, యువ వివాదాస్పద నేత వరుణ్ గాంధీకి పార్టీ పదవిని కట్టబెట్టడం గమనార్హం.

పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన వారిలో సీనియర్ నేతలు నజ్మాహెప్తుల్లా, హేమమాలిని, వినయ్ కతియార్, బీఎస్.కోషియార్, కల్‌రాజ్ మిశ్రా, ఎంఏ.నఖ్వీ, బిజోయ్ చక్రవర్తి, కరుణా శుక్లా, పురుషోత్తమ్ రుపాలా, కిరణ్ ఘాయ్, శాంతా కుమార్‌లు ఉన్నారు.

అలాగే, ప్రధాన కార్యదర్శుల్లో రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర సింగ్ తమోర్, రామ్‌లాల్, అనంత్ కుమార్, తవర్చంద్ గెహ్లాట్, జగత్ ప్రకాష్ నడ్డా, అర్జున్ ముండా, విజయ్ గోయల్, వసుధరా రాజే సింథియాలకు చోటు కల్పించారు. కాగా, పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా సీనియర్ నేత అనంత్ కుమార్ యధావిధిగా కొనసాగుతారు.

పార్టీ కార్యదర్శులుగా వరుణ్ గాంధీ, స్మ్రితీ ఇరానీ, ఆర్తీ మెహ్రా, నవజ్యోతి సింగ్ సిద్ధూ, మురళీధర్ రావు, సరోజ్ పాండే, డాక్టర్ కిరీటి సోమయ్య, తపిర్ గోవా, డాక్టర్ లక్ష్మణ్, కిరణ్ మహేశ్వరి, కెప్టెన్ అభిమన్యు, సౌధాన్ సింగ్, వి.సతీష్, సంతోష్ గంగ్వార్, భూపేంద్ర యాదవ్, వాణి త్రిపాఠీలు ఉన్నారు.

ఇకపోతే.. పార్టీ అధికార ప్రతినిధులుగా షానవాజ్ హుస్సేన్, ప్రకాష్ జావ్‌దేకర్, తరుణ్ విజయ్, నిర్మలా సీతారామ్, రాజీవ్ ప్రతాప్ రూఢీ, రామ్‌నాథ్ కోయిల్‌లుగాను, పార్టీ కోశాధికారిగా పియూష్ గోయల్‌లు ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.