జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పాకిస్థాన్‌లో 42 ఉగ్రవాద స్థావరాలు: ఏకే ఆంటోనీ (Pakistan | Terrorist | AKAntony | India | Talks | Goa)
Bookmark and Share Feedback Print
 
పాకిస్థాన్ కేంద్రంగా 42 ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. వీటి కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు పాక్ పాలకులు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం గోవా రాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి ఆంటోనీ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పాక్‌లో ఉన్న 42 ఉగ్రవాద సంస్థల్లో అనేక సంస్థలు ముమ్మరంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదా మార్పు వచ్చే అవకాశం లేదని మంత్రి ఆంటోనీ పేర్కొన్నారు.

ఇటీవల ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు కూడా పూర్తిగా విజయవంతం కాలేదన్నారు. ముంబై దాడుల సూత్రధారులపై చర్య తీసుకోవాలని భారత్ పదేపదే డిమాండ్ చేస్తోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.