జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ధరలకు కళ్లెంపై మేం చేయగలిగిందేమీ లేదు: అద్వానీ (Advani | Price rise | BJP | President | UPA | Congress | National)
Bookmark and Share Feedback Print
 
దేశంలో ఆకాశాన్ని తాకిన నిత్యావసర వస్తు ధరలపై తాము చేసేదానికి ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. ధరలకు కళ్లెం వేయడం అనేది కేవలం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. పెరిగిన ధరలకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.

పెరిగిన ధరలకు నిరసనగా భాజపా నేతలు గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి పది కోట్ల మంది సంతకాలతో సేకరించిన వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు నిరసనగా తమ పార్టీ గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఇదే అంశంపై చేపట్టిన దేశ వ్యాప్త బంద్‌కు విజయవంతమైందన్నారు.

ధరల పెరుగుదలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే హోదాలో ప్రజలకు కష్టం కలిగించకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు తాము, తమ పార్టీ సభ్యులు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. ఈ సమస్యపై ఇంతకుముంచి తామేమీ చేయలేమన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.