ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కేంద్ర ఎన్నికల సంఘం పీఠంపై తొలి ముస్లిం వ్యక్తి! (S Y Quraishi, first Muslim, Chief Election Commissioner, New Delhi, Chawla)
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్.వై.ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సీఈసీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు 35 సంవత్సరాల అనుంభవాన్ని గడించిన ఈయన కేంద్ర సీఈసీగా ఆయన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం కొనసాగనున్నారు.
కొత్త సీఈసీగా బాధ్యతలు చేపట్టిన ఖురేషీ నేతృత్వంలోనే ఈ యేడాది ఆఖరులో పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, వచ్చే యేడాది బీహార్, తమిళనాడు, అస్సోం, కేరళ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 68 సంవత్సరాల షాహబుద్దీన్ యూకూబ్ ఖురేషీ.. కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీలో ఒకరుగా గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
1971 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఖురేషీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఢిల్లీలోని స్టీఫెన్ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన.. మోడరన్ పర్శియన్, అరబిక్, జర్మన్ భాషల్లో డిస్టింక్షన్ పొందారు. రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ మార్కెటింగ్ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌పై ఒక సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేసిన గౌరవ డాక్టరేట్‌ను పొందారు.