ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి! (Srinagar | Kashmir Valley | Protests | National | Violent | Security | Curfew)
కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి!
కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాశ్మీర్ లోయలోని ప్రధాన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు. నలుగురి మృతితో ఆగ్రహోద్రుక్తులైన స్థానికులు రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శుక్రవారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో 70 మంది గాయపడగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిని బారాముల్లా జిల్లాకు చెందిన మొహ్మద్ రఫీక్, మొహ్మద్ సిద్ధిక్యూగా గుర్తించినట్టు పోలీసు ప్రతినిధి వెల్లడించారు.
దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు చర్యగా కర్ఫ్యూను విధించారు. సున్నిత ప్రాంతాలతో పాటు.. ఉద్రిక్తలు ప్రాంతాలకు పారామిలిటరీ బలగాలను మొహరించారు. స్థానికులు తమ ఇళ్లను వదిలి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.