ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » "ఎన్ఐర్ఐ ఓటింగ్ హక్కుల" బిల్లుకు రాజ్యసభ ఆమోదం! (NRI Voting Rights Bill | Rajya Sabha | Dr M. Veerappa Moily)
విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయలు స్వదేశంలో జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గానూ ప్రవేశపెట్టిన "ఎన్ఐర్ఐ ఓటింగ్ హక్కుల" బిల్లుకు నేడు(మంగళవారం) రాజ్యసభ ఆమోదముద్ర లభించిది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌ను సవరిస్తూ ఈ బిల్లును ఆమోదించామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్పమెయిలీ అన్నారు.
ఈ సవరణ ద్వారా ప్రవాస భారతీయుల హక్కును మన దేశం గుర్తింస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా అక్టోబర్, నవంబర్ మాసాలలో నిపుణుల కమిటీ దేశవ్యాప్తంగా సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తమ నివేదికను సమర్పిస్తుందని మెయిలీ తెలిపారు. ఇతర దేశాలలో పౌరసత్వం స్వీకరించిన భారతీయులకు మాత్రం ఈ బిల్లు వర్తించదని ఆయన అన్నారు.
అయితే.. విదేశాలలో పౌరసత్వ స్వీకరించని భారతీయులు ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కానీ.. ప్రవాస భారతీయులకు మాత్రం ఎన్నికలలో పోటీ చేసే హక్కును కల్పించడం లేదని ఆయన అయన స్పష్టం చేశారు.
ఇదే అంశంపై లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా పార్టీ ఈ నెల 15న అమెరికాలోని వివిధ నగరాల్లో జరుపుకున్న 64వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొన్న వందలాది మంది ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల పిటిషన్‌ను సమర్ధిస్తూ, సంతంకం చేసిన సంగతి తెలిసిందే.