ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధికి 219 మంది మృతి! (Encephalitis | Lives | Toll rises | UP | Gorakhpur | National)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య రీజియన్‌లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. సోమవారం మరో నలుగురు రోగులు మృతి చెందారు. వీరితో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 219కు చేరుకుంది. దీనిపై ఆ రాష్ట్ర అడిషినల్ డైరక్టర్ (ఆరోగ్యం) యూ.కె.శ్రీవాస్తవ మాట్లాడుతూ సోమవారం నలుగురు రోగులు బీఆర్‌డీ వైద్య కళాశాల ఆస్పత్రిలో మృతి చెందినట్టు చెప్పారు.
మృతుల్లో గోరఖ్‌పూర్, కుషీనగర్, డియోరియా జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని చెప్పారు. మిగిలిన ఒక వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన రోగిగా చెప్పారు. కాగా, ఈ రీజియన్‌లో మరో 45 మంది మెదడువాపు వ్యాధి రోగులు వివిధ ఆస్పత్రుల్లో చేరినట్టు ఆయన వివరించారు. ఈ వ్యాధికి మృతి చెందిన 219లో ఒక్క బీఆర్‌డి వైద్య కళాశాల ఆస్పత్రిలోనే 208 మంది మరణించినట్టు ఆయన వివరించారు.