జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాశ్మీర్‌ సమస్యను వెంటనే పరిష్కరించండి: సీపీఐ డిమాండ్ (Kashmir | CPI(M) | Centre Government | Polit Bureau | Srinagar)
Bookmark and Share Feedback Print
 
కాశ్మీర్‌ సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా శాంతియుత చర్చలు ఆరంభించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం శాంతియుత చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.

ఈ విషయమై సీపీఐ పొలిట్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఇందులో కాశ్మీర్ అంశంపై శాంతియుత చర్చలకు జాప్యం చేస్తే పరిస్థితి మరింత దారుణమయ్యే అవకాశం ఉందని సీపీఐ తెలిపింది.

కాశ్మీర్‌ పోలీసు కాల్పుల్లో యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల వామపక్షాలు సంతాపం వ్యక్తం చేశాయి. భద్రతా దళాలు జరిపే లాఠీ ఛార్జ్, కాల్పులు, నీటి బాంబులు విసరడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే శాంతియుత చర్చలు జరపాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.