జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాంగ్రెస్ అధినేత్రిగా నాలుగోసారి ఎన్నికైన సోనియా! (Congress | Sonia Gandhi | National | Prime minister | Manmohan Singh)
Bookmark and Share Feedback Print
 
FILE
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నాలుగోసారి ఎంపికైనట్లు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సంఘం ఛైర్మన్ ఫెర్నాండేజ్ విలేకరులతో చెప్పారు.

సోనియా గాంధీ తరపున ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా వరుసగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

తొలుత వారు 10 జనపథ్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు సోనియా అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత వారు విడి విడిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

సోనియా గాంధీ తరఫున మొత్తం 56 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా చండీగఢ్ నుండి దాఖలైన రెండు నామినేషన్ పత్రాల్లో ఒకదాన్ని తిరస్కంచినట్లు ఆస్కార్ ఫెర్నాండేజ్ తెలిపారు.

నామినేషన్ పత్రంలో పది మంది పీసీసీ డెలిగేట్లు సంతకాలు చేయవలసి ఉండగా తొమ్మిదిమంది మాత్రమే సంతకాలు చేశారని, అందుకే ఆ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకునే ఆఖరు తేదీని కూడా సెప్టెంబర్ పది నుండి మూడో తేదీకి కుదించినట్లు ఆయన చెప్పారు.

ఇకపోతే.. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా నాలుగు నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక నామినేషన్ పత్రం దాఖలు కావడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.