జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోలచే పోలీసుల కిడ్నాప్: ఓ మృతదేహం గుర్తింపు! (Bihar | Mavoists | Police | Abhay Yadav | Nitish Kumar)
Bookmark and Share Feedback Print
 
బీహార్ రాష్ట్రంలోని లఖిషరీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం ఏఎస్ఐ లూకస్‌‌ది అని పోలీసులు నిర్ధారించారు. అంతకుముందు ఆ మృతదేహాన్ని నక్సల్స్‌చే కిడ్నాప్‌కు గురైన నలుగురు పోలీసుల్లో సబ్-ఇన్స్‌స్పెక్టర్ అభయ్ యాదవ్‌దని‌ అని పోలీసులు అనుమానించారు.

కానీ విచారణ అనంతరం ఆ మృతదేహం లూకసేదని పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని గుర్తించిన ప్రాంతంలో మావోయిస్టులు వదలి వెళ్లిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 29వ తేదీన నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన అనంతరం.. జైలులో ఉన్న 8 మంది అనుచరులను విడిపించాలని, లేదంటే చెరలో ఉన్న పోలీసులను హతమారుస్తామని బీహార్ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు.

విధించిన 48 గంటల గడువు బుధవారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. దీంతో మావోయిస్టుల బందీలుగా ఉన్న నలుగురు పోలీసుల్లో ఒకరైన అభయ్ కుమార్ యాదవ్‌ను గురువారం నక్సల్స్ కాల్పి చంపినట్లు సమాచారం అందింది. అయితే లఖిషరీ ప్రాంతంలో కూంబింగ్‌లో ఉన్న లూకాస్ మృతదేహం లభించినట్లు పోలీసు ఉన్నతాధికారి కె.ఎస్. ద్వివేది వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంపై తగిన చర్యలు తీసుకోవడానికిగానూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం అఖిలపక్షంతో భేటీ కానున్నారు.

శనివారం సాయంత్రం జరిగే ఈ అఖిలపక్ష సమావేశంలో మావోయిస్టుల బందీలో ఉన్న పోలీసులను రక్షించేందుకు వీలుగా చర్చలు జరుగుతాయి. ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా బీహార్ రాష్ట్ర పార్టీలకు సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. అలాగే పోలీసులను నక్సల్ చెర నుంచి విడిపించేందుకు మావోయిస్టులతో చర్చలు సిద్ధమని నితీష్ కుమార్ ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.