లంచం తీసుకుంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వెళ్లిన ఓ మహిళా ట్రాఫిక్ ఎస్పీను ట్రాఫిక్ కానిస్టేబుల్స్ జుట్టు పట్టుకొని కిలోమీటర్‌కు పైగా ఈడ్చుకెళ్లి రోడ్డుపై పారేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది.
ట్రాఫిక్ ఎస్పీగా పనిచేస్తున్న కల్పనా సక్సేనా జాట్ రెజిమెంటల్ ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లంచం తీసుకుంటున్నారని ఓ ఆర్మీ జవాన్ ద్వారా తెలుసుంది. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవటాని వెళ్లిన ఆమెను బలవంతంగా జీవుతో ఈడ్చుకెళ్లి రోడ్డుపై విసిరేశారు. ఈ సంఘటనలో ఆమెకు ఎముకలు విరగటంతో పాటు తలపై బలమైన గాయాలయ్యాయి.
"వాళ్లని పట్టుకోవడానికి నేను ఒక గన్‌మెన్, డ్రైవర్‌తో సహా ఓ ప్రైవేటు కార్లో అక్కడికి వెళ్లగా వారు లంచం తీసుకోవడం చాశాను. వాళ్లు నన్ని గుర్తించి నా జుట్టు పట్టుకొని జనమంతా చూస్తుండగా ఒక కిలోమీటరుకు పైగా దూరం ఈడ్చుకెళ్లి చివరకు రోడ్డుపై విసిరేశారు" అని సక్సేనా తన వాంగ్మూలంలో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ ఒక కానిస్టేబుల్‌ని అరెస్టు చేశామని మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసు తెలిపారు. అయితే నిందితులు పారిపోయే సమయంలో ఆమె ఒక కానిస్టేబులు కాలర్ పట్టుకోవడంతో వాళ్లు జీపు ఆపకుండా ఆమెను ఈడ్చుకెళ్లారని వారు తెలిపారు. ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని డిఐజి ఎన్‌కె శ్రీనివాస్ తెలిపారు.