ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » సోనియా రికార్డు: నాలుగోసారి ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఎన్నిక (Sonia Gandhi | Congress | Rosaiah | Manmohan Singh | Rahul Gandhi | Pranab)
సోనియా రికార్డు: నాలుగోసారి ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఎన్నిక
FILE
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నాలుగో సారి ఎంపికై రికార్డు సృష్టించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ ఎన్నికను పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆస్కార్ ఫెర్నాండెజ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
సోనియా గాంధీ పేరు మీద మొత్తం 55 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సోనియా గాంధీ పేరును ప్రతిపాదిస్తూ గురువారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీ, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తదితరులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నాలుగోసారి ఎన్నికకావడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పండుగ చేసుకుంటున్నారు. స్వీట్లు పంచి చిందులేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోనూ పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచి, బాణాసంచాలు పేల్చి సందడి చేసుకుంటున్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం., నాలుగోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు.