జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్ పోలీసులు కిడ్నాప్ కేసులో సూత్రధారి అరెస్టు! (Bihar | Hostage crisis | Mastermind held | Patna | Kidnap | Naxals)
Bookmark and Share Feedback Print
 
బీహార్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న కిడ్నాప్ కథ ముగింపు దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు పోలీసు అధికారుల కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రదీప్ కుమార్‌ను ఆ రాష్ట్ర పోలీసులు శనివారం అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మావోల వద్ద బందీలుగా ఉన్న పోలీసులను ఆచూకీ తెలుసుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ సాగిస్తున్న పోలీసు పార్టీలు జముయ్ అటవీ ప్రాంతంలో ప్రదీప్ కుమార్‌తో పాటు మరికొంతమంది నక్సల్స్‌ను అరెస్టు చేసినట్టు సమాచారం. అదేసమయంలో మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న మిగిలిన పోలీసు అధికారుల గురించి వివరాలు తెలియరాలేదు.

అయితే ప్రదీప్ కుమార్ అరెస్టుపై ఆ రాష్ట్ర పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రాలేదు. దీనిపై ఏడీజీపీ పీకె.థాకూర్ మాట్లాడుతూ లఖిసరాయ్, జముయ్, బంకా, ముంగెర్ జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ సాగుతోందన్నారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కూడా పాల్గొని వుందని, ఈ బృందాలు బందీల ఆచూకీ ఖచ్చితంగా కనుగొంటాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.