జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఎనిమిది రాష్ట్రాల్లో 48 గంటల బంద్‌కు మావోల పిలుపు! (States | Bandh | Maoists | Chidambaram | Kishanji | Regional)
Bookmark and Share Feedback Print
 
కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో మావోయిస్టులు ఈనెల 13వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 48 గంటల పాటు ఈ బంద్‌ను పాటిస్తామని మావో అగ్రనేత కిషన్‌జీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఆజాద్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. అయితే, ఇది ఎన్‌కౌంటర్ కాదని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించగా, శపరీక్ష నివేదిక కూడా ఆజాద్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపినట్టు తేల్చిందని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తరహా వైఖరిని ఖండిస్తూ కేంద్ర హోం మంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు కిషన్‌జీ పేర్కొన్నారు. కాగా, ఈ బంద్ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంఛల్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో సాగుతుందని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.