ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జ్ఞానేశ్వరి రైలు ప్రమాదంలో మరో కీలక వ్యక్తి అరెస్టు! (Jnaneshwari train derailment case | Manoj Mahato | Maoist | arrest)
జ్ఞానేశ్వరి రైలు ప్రమాదంలో మరో కీలక వ్యక్తి అరెస్టు!
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కేసులో మరో కీలక నిందితుడిని శనివారం ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లు అరెస్టు చేశారు. మావోయిస్టు అగ్రనేత మనోజ్ మహతోకు ఈ కేసుతో సంబంధం ఉందంటూ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. మనోజ్ మహతో మధుపూర్ఖల్ గ్రామంలో ఉన్నట్టు సీఆర్పీఎఫ్ జవాన్లకు సమాచారం అందటంతో శనివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. అతడి కుటుంబ సభ్యుల మాత్రం లాల్‌ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్కార్‌లో ఉన్న తమ పూర్వీకుల ఇంటి నుంచి ఎవరో తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు మనోజ్ మహతోను తీసుకెళ్లారని తెలిపారు. మహతో తల్లి వెంటనే క్యాంపు కార్యాలయానికి వెళ్లి మనోజ్ మహతోను కలవడానికి వీలు కల్పించాల్సిందిగా కోరగా.. అయితే, ఆయనను మిడ్నాపూర్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో లాల్‌ఘడ్ పోలీసులను కలవనున్నట్లు ఆమె తెలిపారు.
కొల్‌కతాలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి సమర్ ఘోష్ మహతో అరెస్టుపై మాట్లడటానికి నిరాకరించారు. పశ్చిమ మిడ్నాపూర్ ఎస్పీ కూడా ఈ విషయంపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. గత సెప్టెంబర్ 2009లో ఛత్రధర్ మహతో కూడా ఇద్ గ్రామంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే.