తమ చెరలో ఉన్న ముగ్గురు పోలీసులను విడిపించేందుకు మావోయిస్టులు అంగీకరించినట్టు సమాచారం. అయితే, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వారు నిరాకరించారు. గత ఆదివారం కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులలో ఒకరిని మావోయిస్టులు హత్య చేసిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం శనివారం సాయంత్రం అప్రమత్తమై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో బందీల విముక్తి కోసం మావోయిస్టులతో చర్చలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
దీంతో ప్రభుత్వం ముందుకు వచ్చి మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రటించారు. చర్చలకు వచ్చే మావోయిస్టులకు ఎలాంటి హానీ తలప్టెబోమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రతిపాదనను మావోయిస్టులు తిరస్కరించారు. అయితే బందీలను ఆదివారం నాడు క్షేమంగా వదిలిపెడతామని ప్రకటించారు.