జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు రూ.13,742 కోట్ల ప్యాకేజీ (Naxals | States | Districts | Financial package | Cabinet | National)
Bookmark and Share Feedback Print
 
దేశంలోని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోని జిల్లాలకు కేంద్ర ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించింది. మొత్తం 13,742 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్థిక ప్యాకేజీతో ఈ జిల్లాల్లో రోడ్లు, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ ప్యాకేజీ కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఆమోదం తెలుపనుంది.

నక్సల్స్ ఫ్రభావిత జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 13,742 కోట్ల రూపాయల సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఆమోదం తెలపనుందని ప్రణాళికా సంఘంలో ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు.

మంగళవారం ప్రణాళికా సంఘం ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి ఈ కార్యాచరణ ప్రణాళిక విధి విధానాలను ఖరారు చేస్తుందన్నారు. ఈ ప్యాకేజీకి ఈ నెల 15వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశం ముందు ప్రణాళికా సంఘం ఈ ప్రతిపాదనలను ఉంచే అవకాశముందని ఆ అధికారి చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.