ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఎనిమిదేళ్లలో 109 మిలిటెంట్లు లొంగిపోయారు: తకో దబీ (Militants | Surrendered | Arunachal | Tako Dabi | Home Minister)
అరుణాచల్‌ప్రదేశ్‌లో గడచిన ఎనిమిదేళ్ల నుంచి ఇప్పటి వరకూ కనీసం 109 మంది వివిధ గ్రూపులకు చెందిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో సహా లొంగిపోయారని ఆ రాష్ట్ర ప్రబభుత్వం వెల్లడించింది. వీరిలో చాలా మంది సమస్యాత్మకమైన తిరప్, చంగ్లాంగ్ జిల్లాల నుంచే లొంగిపోయినట్లు అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తకో దబీ తెలిపారు.
వీరంతా గత 2003 నుంచి ఆర్మీ, పారా మిలటరీ బలగాలకు లొంగి పోయినట్లు ఆయన తెలిపారు. వీరిలో 76 మంది ఎన్ఎస్‌సీఎన్, 14 మంది యూఎల్ఎఫ్ఏ, 19 మంది ఏఎన్ఎల్ఏలకు చెందిన వారు ఉన్నారని ఎన్‌సీపీ సభ్యులు బమంగ్ ఫెలిక్స్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కమ్‌తోక్ లోవాంగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తకో దబీ తెలిపారు.
లొంగిపోయిన మిలిటెంట్లు 56 9ఎఎమ్ఎమ్ పిస్టళ్లను, 44 రివాల్వర్లను, 23 ఏకె 47 రైఫిళ్లు, 26 చైనీస్ 0.22 రైఫిల్స్, 10 9ఎమ్ కార్బైన్స్, 9 ఎస్‌బీబీఎల్ గన్స్, 4 ఎమ్-2 యూఎస్ కార్బైన్స్, 2 ఎస్ఎల్ఆర్స్, 2 ఎమ్-21 రైఫిల్స్, 15 గ్రనేడ్లు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 0.303 రైఫిల్స్, బుల్లెట్లను స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.