జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఖైదీలే పోలీసులై.... మద్యం ఖాకీలను రక్షించిన వైనం! (prisoners | policeman | police constables | fun | Muradabad jail)
Bookmark and Share Feedback Print
 
ఖైదీలే పోలీసులైతే..? ఇంకేముంది దేశాన్ని దోచుకు తినైరూ... అంటారా..!? మిగతా వాళ్ల సంగతేమో కానీ.. వాళ్లిద్దరూ మాత్రం అలా కాదు. పారిపోయో అవకాశం ఉండి కూడా పారిపోకుండా ఫుల్లుగా మందు కొట్టి పడిపోయిన పోలీసులను జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి మరీ లొంగిపోయారు. అబ్బా.. అయితే మంచి ఖైదీలే అంటారా..! అనక తప్పదు మరి.

మురాదాబాద్ జైలు నుంచి ముగ్గురు కానిస్టేబుళ్ళు ఇద్దరు ఖైదీలను బిజ్నోర్ కోర్టులో హాజరు పరచటానికి తీసుకువచ్చారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత వాళ్లు నేరుగా జైలుకు వెళ్లకుండా బారుకెళ్లారు. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అని మన పోలీసులు ఫుల్లుగా మందు కొట్టేశారు. నిషా నిషాలో మునిగి తేలిపోయారు.

అయితే ఖైదీలు మాత్రం ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మత్తులో జోగుతున్న కానిస్టేబుళ్లను జాగ్రత్తగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. చట్టాన్ని గౌరవించడమే కాకుండా తమలో ఉన్న మానవత్వాన్ని కూడా నిరూపించుకున్నారు. మరి ఇంత మంచి వాళ్లు జైల్లో ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారో...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.