ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బందీలను విడుదల చేసిన సంగతి తెలియదు: నితీష్ (No knowledge | Maoists | releasing hostages | Nitish Kumar | policemen)
ఆగస్టు 29న లఖీసరాయ్ ఎన్‌కౌంటర్ సందర్భంగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన పోలీసులను విడుదల చేసిన సంగతి తనకు తెలియదని బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. "బందీలను విడుదల చేసిన సంగతి నాకు తెలియదు" అని ఆయన అన్నారు.
మావోయిస్టులు బందీలను విడుదల చేశామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసిన వార్తలను బట్టి చూస్తే మావోయిస్టు నేత కిషన్ జీ బందీలుగా ఉన్న పోలీసుల్లో ఒకరైన అభయ్ ప్రసాద్ కుటుంబ సభ్యులను ఆదివారం తెల్లవారు జామున కలుసుకున్నారు.
అభయ్ ప్రసాద్ త్వరలోనే ఇంటికి వస్తారని వారికి హామీ ఇచ్చారు. కాగా.. కిడ్నాప్ చేసిన ముగ్గిరు పోలీసులను వెంటనే విడిచిపెట్టి, ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన చర్చల్లో పాల్గొనాలనేందుకు వచ్చిన మావోయిస్టు ప్రతినిధులను క్షేమంగా తిరిగి పంపించాలనే ఏకాభిప్రాయానికి అఖిల పక్ష సమావేసం చేరుకుందని నితీష్ కుమార్ శనివారం తెలిపారు.