జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విధాన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం తగదు: ప్రధాని (Supreme Court | PM | Manmohan | Food grains | Distribution | Courts | National)
Bookmark and Share Feedback Print
 
పాలనా పరమైన విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత ఆహార సంస్థకు చెందిన గోదాముల్లో మగ్గుతున్న ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా పంచాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. అపెక్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రధాని సోమవారం తొలిసారి స్పందించారు.

దేశంలో దాదాపు 37 శాతం మందికి పైగా ప్రజలు దారిద్యరేఖకు దిగువున ఉన్నారన్నారు. వీరందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇలాంటి కీలక, వివాదాస్పద విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడిందని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

ఇకపోతే కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాలకు ముందే ఈ విస్తరణ ఉండవచ్చునని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. అదేసమయంలో తాను పదవీ విరమణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసలు ఆ అవసరమే లేదన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.