ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఆరు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల: ఖురేషీ వెల్లడి (New Delhi | Bihar | Six phases | October | EC | SYQuraishi | National)
ఆరు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల: ఖురేషీ వెల్లడి
బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగరానా మోగింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఆరు దశల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియ అక్టోబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై దాదాపు నెల రోజుల పాటు సాగనుంది.
ఆరు దశల ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు అక్టోబరు 21వ తేదీన 47 సీట్లకు తొలి దశ పోలింగ్ జరుగనుంది. రెండో దశ పోలింగ్ 45 సీట్లకు అక్టోబరు 24వ తేదీన నిర్వహిస్తారు. మూడో దశలో అక్టోబరు 28న 48 సీట్లకు, నాలుగో దశలో నవంబరు ఒకటో తేదీన 42 సీట్లకు, ఐదో దశలో నవంబరు 9వ తేదీన 35 సీట్లకు, ఆరో దశలో నవంబరు 20వ తేదీన 26 సీట్లకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్.వై.ఖురేషీ వెల్లడించారు.
ఆరు దశల పోలింగ్‌కు మొత్తం 56943 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5.50 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బంకా లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కూడా నవంబరులో నిర్వహించనున్నారు.