జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » దేశ వ్యాప్తంగా సాగుతున్న కార్మిక సంఘాల సమ్మె! (Trade unions | 24-hour | Nationwide bandh | Prise rice | Bengal | Tripura)
Bookmark and Share Feedback Print
 
నిత్యావసర వస్తు ధరలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా దేశంలోని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం సార్వత్రిక సమ్మె జరుగుతోంది. శ్రామికజీవుల కంచుకోటగా ముద్రపడిన పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం పూర్తిగా ఉంది. సాధారణంగా ప్రజా రవాణా వ్యవస్థతో పాటు విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది.

24 గంటల పాటు సాగే ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా దాదాపు ఆరు కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు స్తంభించనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, అసంఘటిత, సంఘటిత కార్మికులు కూడా తమ వంతుగా ఈ సమ్మెలో పాలు పంచుకుంటున్నారు.

ఈ సమ్మెకు ప్రధానంగా ఏఐసీసీటీయు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంకేజీ, యూటీయూసీలతో పాటు ఇతర పారిశ్రామిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నయ్‌, బెగుళూరులలో రోజువారి బ్యాంకు కార్యకలాపాలు కూడా స్తంభించి పోయాయి. ప్రధానంగా వామపక్ష పాలిత రాష్ట్రాలైన కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్‌లలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.