ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బెంగాల్‌లో లెఫ్ట్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్: రాహుల్ (Rahul Gandhi | Bengal | Left parties | Govt | Natioinal | Rajiv Gandhi)
బెంగాల్‌లో లెఫ్ట్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్: రాహుల్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జోస్యం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పేదల అభ్యున్నతికి, సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను బెంగాల్‌లోని వామపక్ష పార్టీలు లూటీ చేస్తున్నాయని ఆరోపించారు.
గత రెండు దశాబ్దాలుగా బెంగాల్ పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు. కానీ, అధికార పార్టీకి చెందిన సభ్యులు వజ్ర వైఢూర్యాలు, కోట్లాది రూపాయలను సమకూర్చుకున్నారన్నారు. ఇలాంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు తగిన శాస్తి చేయాలన్నారు.
తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సయమంలో సోవియట్ దేశ నేతలు వచ్చి కలిశారని, ఆ సమయలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పాలనలో ఉందన్నారు. ఒక రోజున సోవియట్‌లో వామపక్ష పాలన తుడిచిపెట్టుకుని పోయిందనే వార్తను పత్రికలో చూసి ఆశ్చర్య పోయానన్నారు. ఇదే పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమవుతాయని రాహుల్ జోస్యం చెప్పారు.