జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మళ్లీ చెలరేగిన అల్లర్లు: శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధింపు! (Curfew | Srinagar | Violence | National | Police stations | Stone-pelting mob)
Bookmark and Share Feedback Print
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. సోమవారం రాత్రి చెలరేగిన అల్లర్ల కారణంగా ఆందోళనకారులను అణిచి వేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో నలుగురు యువకులు కోల్పోయారు. దీంతో అల్లరిమూకలు పెట్రేగి పోయి పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. పాత నగరంలోని రైనావారి, మహారాజ్‌గంజ్, సపాకదల్, ఖన్యార్, నౌహాట్టా పాటు.. మౌసుమా, బతమాలో, క్రాల్‌ఖుడ్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కర్ప్యూను అమలు చేస్తున్నారు.

అంతకుముందు శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మెహ్రాజ్ అహ్మెద్ కక్రూ మాట్లాడుతూ ఆందోళనకారుల ఉద్యమం కారణంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆంక్షలను విధించినట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని, పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.