జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్‌లో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం మద్దతు! (BJP | To form govt | Jharkhand | JMM support | National | AJSU)
Bookmark and Share Feedback Print
 
జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోనుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు జార్ఖండ్ ముక్తిమోర్ఛా (జేఎంఎం) మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు జోరందుకున్నాయి.

దీనిపై భాజపా సీనియర్ నేత అజయ్ మారో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకోసం కొత్త శాసనసభాపక్ష నేతలు పార్టీ సభ్యులు ఎన్నుకుంటారని, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరుతామని చెప్పారు.

ఏప్రిల్ నెలలో ధరల పెరుగుదలపై లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వంపై భాజపా ప్రవేశపెట్టిన కోత తీర్మానికి అనుగుణంగా జేఎంఎం చీఫ్ శిబూ సొరేనే ఓటు వేయడంతో భాజపా మద్దతును ఉపసంహరించుకుంది. ఫలితంగా జేఎంఎం ప్రభుత్వం కూలిపోయింది. కాగా, భాజపా నేత రేసులో మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ముందు వరుసలో ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.