జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బాలీవుడ్ నటుడు షైనీ అహుజా రేప్ చేయలేదు: పనిమనిషి (Shiney Ahuja | Raped | Domestic help | Mumbai | Bollywood | Court)
Bookmark and Share Feedback Print
 
బాలీవుడ్ చిత్ర నటుడు షైనీ అహుజా తనపై అత్యాచారం చేయలేదని ఆయన ఇంటిలో పనిమనిషి కోర్టుకు చెప్పింది. తాను కావాలనే నటుడిపై అబద్ధపు ఆరోపణలు చేసినట్టు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మేజిస్ట్రేట్‌కు విన్నవించింది.

బాలీవుడ్ నటుడు షైనీ అహుజా ఇంటిలో పని చేసే పనిమనిషి.. తనపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు చేయడంతో షైనీని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో మూడు నెలల పాటు షైనీ అహుజా జైలులో ఉన్నాడు.

కాగా, ఈ కేసు విచారణ ముంబై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచారణ మంగళవారం రాగా, కోర్టుకు హాజరైన బాధితురాలు.. తనపై షైనీ ఎలాంటి అఘాయిత్యం లేదా అత్యాచారం చేయలేదని వెల్లడించింది. షైనీ అహుజా ఇంటిలో పని దొరికేందుకు సహచరించిన ఒక మహిళ ఒత్తిడి మేరకే ఈ ఆరోపణలు చేసినట్టు తెలిపింది.

ఈ అత్యాచారం కేసులో అహుజా 2009 జూన్‌లో పోలీసులు అరెస్టు చేయగా, మూడునెలల పాటు జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత 2009 అక్టోబరు ఒకటో తేదీన బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.