ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాశ్మీర్‌లో రాళ్లు విసిరే వారి వెనుక లష్కరే తోయిబా హస్తం! (Lashkar-e-Taiba | Militant Group | Violent | Demonstrations | stone pelting in kashmir)
కాశ్మీర్‌లో రాళ్లు విసిరే వారి వెనుక లష్కరే తోయిబా హస్తం!
కాశ్మీర్ అల్లర్లలో రాళ్లు విసిరే వారి వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఈ తోయిబా తీవ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్ అధికారులు ప్రకటించారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న అల్లర్లకు కారణమైన పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఈ తోయిబా మిలిటెంట్ గ్రూపును ఇటలిజెన్స్ బ్యూరో దుయ్యబట్టింది.
గత జూన్ 11న కాశ్మీర్ లోయలో ప్రారంభమైన ఈ అల్లర్లలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షనల్లో ఇప్పటి వరకూ 69 యువకులు మృతి చెందారు. ఇంటలిజెన్స్ బ్యూరో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది. ఈ అల్లర్లకు పాల్పడే యువతకు తీవ్రవాద సంస్థలకు చెందిన స్థానికంగా ఉండే వ్యక్తులు ఆర్థిక సహాయం చేసి ఈ గొడవలకు యువతను రెచ్చగొడుతున్నట్లు ఇంటలిజెన్స్ బ్యూరో పేర్కొంది.
శ్రీనగర్ సిటీ మొత్తం కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని పోలీసులు తెలిపారు. గత అర్ధరాత్రి వరకూ ఆందోళనకారులు భద్రతాబలగాలపై రాళ్లు విసురుతూనే ఉన్నారని వారు తెలిపారు. కాగా కాశ్మీర్‌లో అల్లర్లు ఇంకా అదుపులోకి రాకపోవడంతో పోలీసులు బుధవారం కూడా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.
ఈ అంశంపై చర్చించేందుకు గత జూన్ 30, 2010న ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి పి చిదంబరం, డిఫెన్స్ మంత్రి ఏకె ఆంటోనీలు పాల్గొన్నారు. ఈ సమస్య నివారణకు చర్చలే పరిష్కారమని వారు భావిస్తున్నారు. ఈ సంబందిత వర్గాలను చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు.