ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాశ్మీర్‌లో 2,800 కానిస్టేబుల్ పోస్టులకు 59,000 అప్లికేషన్లు (Posts of constables | Police Department | Jobs | JK police | Vally)
కాశ్మీర్‌లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగలు కోసం దాదాపు 59,000 మంది ఉద్యోగార్ధులు ధరకాస్తు చేసుకున్నారు. ఓ వైపు అల్లర్లతో కాశ్మీర్ లోయ అట్టుడుకి పోతుంటే వారిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలను మరింత పెంచుకోవాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. ఈ దశలో భాగంగా దాదాపు 2800 కానిస్టేబుల్ పోస్టులకు ధరకాస్తులను ఆహ్వానించింది.
"కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2,786 ధరకాస్తులను ఆహ్వానించాం. ఇప్పటికే 524 సబ్ ఇన్సెపెక్టర్ (ఎస్సై) పోస్టులను కేటాయించిన సమయంలోనే భర్తీ చేశాం" అని జమ్మూ కాశ్మీర్ పోలీస్ ప్రధాన కార్యాలయం ఏఐజి నూరుద్దీన్ వాని తెలిపారు. కాశ్మీర్ లోయలో 2,786 కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రకటన ఇస్తే 58,975 మంది అభ్యర్ధులు ధరకాస్తులు చేశారని ఆయన తెలిపారు.
ఈ స్పందన చూస్తుంటే.. పోలీసు శాఖలో చేరడానికి అభ్యర్ధులు మక్కువ చూపుతున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు కాశ్మీర్ లోయలో మంగళవారం విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగతూనే ఉంది. మంగళవారం రాత్రి వరకూ ఆందోళనకారులు రాళ్లు రువ్వుతుండటంతో పరిస్థితి అదుపులోకి రాకపోయిన కారణంగా పోలీసులు బుధవారం కూడా కర్ఫ్యూని విధించారు.