జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు అవినీతిపరుడు! (Central Vigilance Commissioner | Pratyush Sinha | 1 in 3 Indians utterly corrupt)
Bookmark and Share Feedback Print
 
ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పూర్తిగా అవినీతిపరులుగా తేలింది. అలాగే, సగం మంది ప్రజలు సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్నట్టు కేంద్ర అవినీతి విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌ (సీవీసీ)గా ఈ వారంలో పదవీ విరమణ చేసిన ప్రత్యూష్ సిన్హా దేశంలో లంచగొండితనం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలలో చాలా వరకు ప్రతిది డబ్బుతోనే చూస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లంచం తీసుకునే దేశాలలో భారత్ 84వ స్థానంలో 3.4 పాయింట్ రేటింగ్‌ను కలిగి ఉంది. 9.4 పాయింట్లతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో, 1.1 పాయింట్ల స్థానంతో సోమాలియా చివరి స్థానంలో ఉంది.

దేశంలో 20 శాతం మంది మాత్రమే నిజాయితీపరులని సిన్హా తెలిపారు. మరో 30 శాతం మంది మాత్రంగా పూర్తిగా అవినీతిపరులని, మిగిలిన 50 శాతం మంది ప్రజలకు అవినీతిపరంపరకు దాదాపు సరిహద్దుల్లో ఉన్నారని ఆయన వివరించారు. ఇప్పడున్న భారతదేశంలో ఎవరికైన చాలా డబ్బు ఉంటే అతడ్ని గౌరవిస్తారు. అంతే కానీ.. ఎవ్వరూ అతనికి అంత డబ్బు ఎలా వచ్చిందో ప్రశ్నించరు.

ఇందుకు పెద్ద ఉదాహరణలే న్యూ ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్, ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ వంటివి. ఇప్పుడు స్పాట్ ఫిక్సింగ్ యావత్ క్రికెట్ జగత్తులోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరంతా పెద్ద పెద్ద వాళ్లు కాబట్టి పెద్ద కుంభకోణాలు. "ఎంత చెట్టుకు అంత గాలి" అన్నట్లు "ఎంత స్థాయికి అంత అవినీతి" అన్న చందంగా మారింది నేటి భారతం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.