జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోటీకి నితీశ్ కుమార్ దూరం! (CM | Nitish Kumar | Contest | Bihar Assembly | Polls | JD(U), Election)
Bookmark and Share Feedback Print
 
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని బుధవారం ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమేముంది? నేను ఇప్పటికే ఎమ్మెల్సీలో సభ్యుడు. తన పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉందని గుర్తు చేశారు.

తాము చేపట్టిన అభివృద్ధి పథకాలను పూర్తి చేసేందుకు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తిరిగి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాను. 2005లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కేంద్ర రాజకీయాల్లో ఉన్న నితీశ్ కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబరు-నవంబరు నెలల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.