జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అయోధ్య స్థల వివాదంపై సెప్టెంబర్ 24న తుది తీర్పు! (Ayodhya Ramalayam | Ayodhya | Babri Masjid)
Bookmark and Share Feedback Print
 
గత ఆరు దశాబ్దాలుగా భారత రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న అయోధ్య స్థల వివాదానికి సంబంధించిన కేసుకు త్వరలోనే తెరపడనుంది. ఈ కేసుకు సంబంధించి తది తీర్పును అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో బెంచ్‌ ఈ నెల 24న ఇవ్వనుంది.

గత జులైలో జరిగిన విచారణలో తుది తీర్పు ప్రకటించే తేదీని రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తులు ఎస్‌యు ఖాన్‌, సుధీర్‌ అగర్వాల్‌, డివి శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంబంధిత వర్గాల న్యాయవాదులకు సమాచారం అందచేసింది.

కాగా.. అయోధ్య స్థలంపై అరవై ఏళ్లుగా సాగుతున్న వివాదాలకు సంబంధించి వెలువడే ఈ తీర్పు రాజకీయ సంచలనాల్ని కలిగించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ వివాదంలో కోర్టు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనుంది.

ఇదులో మొదటిది 1538కి ముందు వివాదాస్పద స్థలంలో ఆలయం వుందా?, రెడవది 1961లో బాబ్రీ కమిటీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పరిమితుల పేరుతో నిషేధానికి గురైందా?, ఇకపోతే మూడవది. ముస్లింలు ప్రతికూల మార్గంలో స్థలంపై హక్కును పొందారా? అనే మూడు అంశాలపై దృష్టి సారించింది.

ఈ స్థల వివాదంపై మొదటి కేసు 1950లో గోపాల్‌సింగ్‌ విశారద్‌ అనే వ్యక్తి కోర్టుల దావా వేశారు. ఈ అయోధ్య స్థలంలో శ్రీరాముని పూజించేందుకు అనుమతిని ఇవ్వాలంటూ ఆయన తన పిచిశన్‌లో పేర్కొన్నారు. ఇదే సంవత్సరం అదే ఉత్తర్వులు కోరుతూ పరమహంస తామచంద్రదాస్‌ మరో కేసు వేశారు. కానీ కొద్ది రోజులకే ఆయన కేసు ఉపసంహరించుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.