ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజీవ్ గాంధీయే ఆ పని చేశారు: మంత్రి కపిల్ సిబాల్ (Rajiv Gandhi | Kapil Sibal | Education Bill | International)
నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యాన్ని త్వరగా నెరవేర్చాలని భావించడంలో తప్పులేదని, నాడు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ సైతం కొద్ది నెలల్లోనే ఈ లక్ష్యాన్ని త్వరగా అమలు చేయాలని అభిలాషించారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.
రాజీవ్ గాంధీ తలపెట్టిన జవహర్ నవోదయ విద్యాలయాస్ (జెఎన్‌వి)కు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. విద్యా బిల్లును ఆమోదింపజేయడానికి తొందర పడుతున్నట్లుగా విమర్శకులు చేస్తున్న ఆరోపణలను కపిల్ సిబాల్ ఖండించారు.
విద్యా బిల్లు కోసం తాను తొందర పడుతున్నానని ఎవరైనా భావిస్తే, ఈలక్ష్యాన్ని కొద్ది మాసాల వ్యవధిలోనే పూర్తి చేయాలని 1985లోనే రాజీవ్‌గాంధీ సంకల్పించారన్న విషయాన్ని వారికి గుర్తుచేయాల్సి వస్తుందని మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు.