ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మంగళూరు విమాన ప్రమాదం: పైలట్ తప్పిదమే కారణం (Pilot blamed | Mangalore air crash | Air India Express crash in Mangalore)
ఇటీవల మంగళూరులో సంభవించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఏ) అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. బుధవారం విచారణ కోర్టు(సీఓఐ)లో డిజిసిఏ తమ నివేదికను సమర్పిచింది.
గత మే 22, 2010న కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు. ఈ కేసు విచారణలో భాగంగా విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలించిన అధికారులు విమాన ల్యాండింగ్ సమయంలో రన్‌వే విషయంలో సహ పైలట్ హెచ్చరిస్తున్నప్పటికీ పైలట్ తప్పు గణాంకాలతో ల్యాండింగ్ చేయడం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అదికారులు తెలిపారు.
సుమారు 2.05 నిమిషాల నిడివి గల కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో సహ పైలట్ రన్‌వే ఇంకా రాలేదు, ల్యాండింగ్ చేయకు అని చెబుతున్నా కూడా వినకుండా పైలట్ ల్యాండింగ్ చేశాడు. ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు "రన్‌వే లేదు" అనే వాయిస్ రికార్డ్ అవడంతో పాటు పెద్ద పేలుడు శబ్దం రికార్డ్ అయినట్లు వారు తమ నివేదికలో పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ సరైన కొలతలు పాటించక పోవడమే ఇందుకు కారణమని వారు నిర్ధారించారు.