ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్ సీఎంగా సెప్టెంబర్ 11న అర్జున్‌ముండా ప్రమాణం (President rule lifted | Jharkhand | approved | revocation | Arjun Munda | Shibu Soren)
జార్ఖండ్ సీఎంగా సెప్టెంబర్ 11న అర్జున్‌ముండా ప్రమాణం
జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఉపసంహరించడానికి యూనియన్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), జార్ఖండ్ ముక్తి మోర్చాతో (జెఎంఎం) రెండు పార్టీలూ చేతులు కలిపిన నేపధ్యంలో రాష్ట్రంలో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని, ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేయాలంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ప్రభుత్వాన్ని కోరిన మీదట, కేంద్రం ఆమోదం తెలిపింది.
జార్ఖండ్‌లో మొత్తం 81 శాసన సభ్యులకు గానూ తనకు 45 మంది శాసస సభ్యుల మద్దతుందని, ఈ మేరుకు వారి మద్దతుతో కూడిన లేఖను అర్జున్ ముండా జార్ఖండ్ గవర్నర్ ఎం.ఒ.హెచ్ ఫరూక్‌కు అందజేశారు. గత జూన్ 2వ తేదీ నుండు జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన నడుస్తుంది.
గత ఏడాది నవంబర్ - డిసంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిసెంబర్ 30న సిబూ సొరేన్‌ను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కానీ అప్పట్లో బిజెపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో మే 30వ తేదీన ముఖ్యమంత్రి పదవి నుంచి శిబూ సొరేన్ తప్పుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాష్రపతి పాలను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.