ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విదేశీ పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్! (Pratibha Patil | ASEAN countries | Cambodia | Laos | Jawaharlal Nehru | President)
విదేశీ పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్!
FILE
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఆసియా దేశాల్లో పర్యటనకు గాను రాష్ట్రపతి గురువారం ప్రయాణమయ్యారు. లావోస్, కంబోడియా వంటి దేశాల్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పర్యటిస్తారు. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి కాంతిలాల్ భురియా నేతృత్వంలో బృందం కూడా విదేశ పర్యటనలో పాలుపంచుకుంటుంది.
తొలుత లావోస్‌కు చేరుకునే రాష్ట్రపతి అక్కడ 13వ తేదీ వరకు పర్యటిస్తారు. అనంతరం 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కంబోడియాలో ప్రతిభా పాటిల్ పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా సాంస్కృతిక సంబంధించిన పలు ఒప్పంద పత్రాలు సంతకాలయ్యే అవకాశం ఉంది.
గత 1954 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ లావోస్‌లో పర్యటించారు. నెహ్రూ పర్యటన తర్వాత భారత రాష్ట్రపతి హోదాలో ప్రతిభా పాటిల్ లావోస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.