ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కులం ప్రాతిపదికన జనాభ లెక్కలకు కేంద్రం ఆమోదం (Caste based census | Cabinet | Census | Pranab Mukherjee | India | Population | Head Count)
జనాభ లెక్కలలో కులం చేర్చే అంశంపై గత కొద్ది రోజులుగా ఉన్న సందిగ్దతకు ఎట్టకేలకు తెరపడింది. కులం ప్రాతిపదికన జనాభ లెక్కలు సేకరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో పలువురి మంత్రు అభిప్రాయాలను సేకరించిన అనంతరం హోం మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని కేంద్రంలో ప్రతిపాదించారు.
ప్రతిపాదిత కులం ఆధారిత జనాభ లెక్కల ప్రకారం జనగణన సమయంలో ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలను జనాభ లెక్కలలో చేరుస్తారు. ఈ జనాభ లెక్కల ప్రక్రియ జూన్ 2011 నుంచి సెప్టెంబర్ 2011 మధ్య ప్రారంభం అవుతుంది. దాదాపు 80 ఏళ్ల తర్వాత ఇలా కుల ప్రాతిపదికన జనాభ లెక్కలు సేకరించాలని డిమాండు చేయడం ఇది రెండవ సారి. గతంలో 1931లో కుల ప్రాతిపదికన జనాభ లెక్కలు చేపట్టాలని పార్లమెంటులో చాలా సార్లు పలువురు భిన్న వాదాలు వినిపించారు.
ఇంటికి ఇంటికి తిరిగి జనాభ లెక్కలు సేకరించేందుకు గానూ దాదాపు రూ. 2,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందుకోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఓ మంత్రుల బృందాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు.