భూసేకరణలో అన్నదాతలకు యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాసటగా నిలిచారు. రైతుల వద్ద భూములను లాక్కోవడం సరికాదని సోనియా గాంధీ అన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణకు సంబంధించి సమతులన విధానం అవలంబించాలని సోనియా గాంధీ సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న దాద్రి ఎన్‌టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు రెండవదశలో 490 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. దీన్ని దేశ రాజధాని నగరంలో జరుగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల సందర్భంగా ఉపయోగించుకోవచ్చునని సోనియా గాంధీ వెల్లడించారు.
ఇంకా భూసేకరణ గురించి సోనియా గాంధీ మాట్లాడతూ.. భూసేకరణ లేకుండా మౌలిక సదుపాయాలు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం కుదరదు. అయితే సారవంతమైన వ్యవసాయభూమిని మాత్రం సేకరించకూడదని సోనియా గాంధీ అన్నారు. తద్వారా అన్నదాతలకు అన్యాయం చేయకూడదని సోనియా గాంధీ హితవు పలికారు.