ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » క్రిమినల్ కేసును కొట్టివేయండి: కోర్టుకు మల్లిక విజ్ఞప్తి! (Mallika Sherawat | Bombay HC | Nagpur | Bombay High Court | Social worker)
బాలీవుడ్ సెక్స్ సుందరి మల్లికా షెరావత్ ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఓ సంఘ సేవకుడు తనపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ బొరిలే అనే సంఘ సేవకుడు 2009 సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తేదీన యవత్మాల్ జిల్లా పంధర్‌క్వాడా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసి, అందులో భారత శిక్షాస్మృతి చట్టం 291 నిబంధన మేరకు మల్లికా షెరావత్‌పై క్రిమినల్ కేసును నమోదు చేశారు.
షాది కీ పెహ్లే, మర్డర్, మాన్ గయా ముఘల్ ఇ అజామ్ తదితర చిత్రాల్లో ఈ చిత్ర నటి అశ్లీలంగా నటించిందని, ఇలా నటించడం యువతరంతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసమే ఈ నటి హద్దులుదాటి నటిస్తోందని, అందువల్ల ఆమెపై ఐపీసీ సెక్షన్ 291 మేరకు కేసును నమోదు చేయాలని ఆయన పిటీషన్‌లో కోరారు.
ఈ పిటీషన్‌ను పరిశీలించిన ఈ కోర్టు 2010 ఏప్రిల్ మూడో తేదీన మల్లికకు సమన్లు జారీ చేసింది. అయితే ఆమె కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మల్లికా షెరావత్ హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేసి, తనపై మోపిన కేసును కొట్టివేయాలని కోరారు. అయితే, జస్టీస్ పి.డి.కోడే నటి విజ్ఞప్తిని తిరస్కరించి, ఈనెల 23వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పిటీషన్ దారునుకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.