జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | రౌండప్ 2010 | వైఎస్సార్ | జగన్ మోహన్ రెడ్డి
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉత్తరప్రదేశ్‌ను 4 ముక్కలు చేయండి : "మాయ" తీర్మానం (Up Division Bill | Passed With Voice Vote | Mayawati | sp | bjp | Congress)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి చేసిన ప్రతిపాదనపై యూపీలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇదే అంశంపై ఓ తీర్మానం చేసేందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సమావేశమైంది.

ఆ తర్వాత యూపీని నాలుగు రాష్ట్రాలు చేసే తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాయావతి ప్రవేశపెట్టగా, ఈతీర్మానాన్ని భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సభలో గందరగోళం నెలకొనడంతో తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఆ తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

అంతకుముందు సోమవారం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ఎస్పీ సభ్యులు స్పీకర్‌ను కలిసి మాయావతి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు నోటీసు ఇచ్చారు. ఎస్పీ సభ్యులు సభలోనికి ప్రవేశించే సమయంలోనే మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబూని వచ్చారు. దీన్ని సూచిన వెంటనే స్పీకర్ సభను వాయిదా మధ్యాహ్నం 12.20 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మోజువాణి ఓటుతో ఆమోదించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia