జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పంజాబ్-ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ (Parkash Singh Badal | Amarinder Singh | Assembly Elections | Punjab | Uttarakhand)
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లో 77 శాతం, ఉత్తరాఖండ్‌లో 70 శాతం చొప్పున ఈ పోలింగ్ శాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండబా, పంజాబ్‌లో అకాలీదళ్-భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు చెక్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. దీనిపై ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో 77 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉత్తరాఖండ్‌లో 70 శాతం మేరకు పోలింగ్ నమోదైంది.

కాగా, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను అణిచివేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పులు ఒకరు చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1866 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

వీరిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, బీసీ ఖండూరీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా.. ఎన్డీయే కూటమికి ఈ రెండు రాష్ట్రాలు అత్యంత కీలకంకానున్నాయి.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia