ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కల్మాడీని బలిపశువును చేసిన కాంగ్రెస్: వెంకయ్య ధ్వజం (Suresh Kalmadi | Congress | Venkaiah Naidu | Congress | BJP)
కల్మాడీని బలిపశువును చేసిన కాంగ్రెస్: వెంకయ్య ధ్వజం
మంగళవారం, 31 జనవరి 2012( 14:05 IST )
కామన్వెల్త్ కుంభకోణంలో సురేష్ కల్మాడీని కాంగ్రెస్ పార్టీ బలి చేసిందని భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీని కామన్వెల్త్ స్కామ్‌లో కాంగ్రెస్ ఇరికించిందని వెంకయ్య తెలిపారు.
కామన్వెల్త్ నిధుల అవకతవకలపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అలాగే క్రీడా శాఖ మంత్రిని కూడా కామన్వెల్త్ స్కామ్‌లో ఎందుకు అరెస్ట్ చేయలేదని వెంకయ్య అడిగారు.
వీరినందరిని వదిలిపెట్టి కేవలం సురేష్ కల్మాడీని మాత్రం కాంగ్రెస్ పార్టీ బలిపశువును చేయడంతోనే ఆయనొక్కడే దొరికిపోయాడని వెంకయ్య ధ్వజమెత్తారు.
ఇకపోతే.. కామన్వెల్త్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సురేష్ కల్మాడీకి ఊరట లభించింది. సీడబ్ల్యూజీ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.