ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు హైకోర్టులో చుక్కెదురు! (Yeddyurappa | Karnataka | bjp | High Court)
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు హైకోర్టులో చుక్కెదురు!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. అవినీతి కేసుల దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టిపారేసింది.
తనపై లోకాయుక్త చేస్తున్న దర్యాప్తును నిలిపి వేయాలని కోరుతూ యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమి అక్రమ డీ నోటిఫికేషన్‌కు సంబంధించిన రెండు కేసులపై లోకాయుక్త దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చడం ద్వారా యడ్డీకి ఎదురుదెబ్బ తగిలింది.
కాగా గతంలో కోర్టు ముందు హాజరు కాకపోవడంతో యడ్యూరప్పను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం యడ్యూరప్పకు బెయిల్ మంజూరు కావడంతో బీజేపీ అధిష్టానం తనకు కీలక పదవిని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంకా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారు.