ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జయలలితకు శశికళ స్లో పాయిజన్ ఇచ్చిందా...?!! (Jayalalitha | Sasikala | Slow Poison | Tehelka | Aiadmk)
జయలలితకు శశికళ స్లో పాయిజన్ ఇచ్చిందా...?!!
మంగళవారం, 31 జనవరి 2012( 16:44 IST )
File
FILE
శశికళ బహిష్కరణ తర్వాత ఇన్నాళ్ల తర్వాత మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జయలలితకు శశికళ స్లో పాయిజన్ ఇచ్చినట్లు తెహల్కా సంచలన కథనాన్ని ప్రచురించింది. స్లో పాయిజన్ ఇవ్వడం ద్వారా జయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని శశికళ కుట్ర పన్నారని ఆ కథనంలో వెల్లడించింది.
తెహెల్కా ప్రచురించిన కథనం ప్రకారం... జయలలిత ఆహార వ్యవహారాలను చూసే నర్స్‌ను శశికళే నియమించింది. ఆ నర్సు ద్వారా జయలలిత భోంచేసే పదార్థాల్లో తక్కువ మోతాదులో ఉండే విషతుల్య పదార్థాలను జోడింపచేసింది. అయితే ఈ వివరాలు ఎవరు చెప్పారన్న దానిపై తెహెల్కా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
55 ఏళ్ల శశికళ మన్నార్కుడి మాఫియాతో చేతులు కలిపి అమ్మ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్రణాళిక రచించిందని పేర్కొంది. అంతేకాదు... ఈమధ్య అక్రమాస్తుల కేసు విషయంలో బెంగళూరు కోర్టుకు హాజరైనప్పుడు కూడా మన్నాక్కుడి మాఫియా చెప్పినవిధంగా జయ అక్కడి వెళ్లిందనీ, ఒకవేళ కోర్టులో చుక్కెదురైతే, తను విశ్వసించేవారికి అధికార పీఠాన్ని కట్టబెట్టాలని అనుకున్నదని తెహెల్కా కథనం.
అసలు శశికళ కుట్ర బయటపడటానికి కారణం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీనట. అదెలాగంటే... ఎన్నారై వ్యాపారవేత్త ఒకరు తమిళనాడులో ఓ భారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వచ్చాడట. సహజంగా ఏ వ్యాపారవేత్త అయినా ప్రభుత్వ అనుమతులకోసం అధికార పార్టీని కలవడం సహజం. అదే రీతిన ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు ఆ వ్యాపారవేత్త సమాయత్తమవుతున్న దశలో మన్నార్కుడి జోక్యం చేసుకుని ప్రాజెక్టులో 15 శాతం వాటా ఇవ్వమని కోరిందట. దీంతో సదరు ఎన్నారై తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రాజెక్టును గుజరాత్‌లో స్థాపించాడట. ఆ సందర్భంలో జయ చుట్టు ఉన్న జనం గురించి నరేంద్ర మోడీకి తెలియడంతో, ఆయన ముఖ్యమంత్రి జయలలితను హెచ్చరించినట్లు తెహల్కా వెల్లడించింది.
విషయం తెలుసుకున్న జయలలిత వెంటనే స్పందించి శశికళను, ఆమెకు మద్దతుగా ఉన్న మంత్రులతోపాటు ఇతర వ్యక్తులను సైతం పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిదట.