ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 2జీ కేసు: చిదంబరం రాజీనామా చేయక తప్పదేమో..?!! (Chidambaram | 2g Scam | Supreme Court | cbi)
2జీ కేసు: చిదంబరం రాజీనామా చేయక తప్పదేమో..?!!
మంగళవారం, 31 జనవరి 2012( 20:35 IST )
FILE
2జీ కుంభకోణం ఉచ్చు యూపీఎను వెంటాడుతోంది. 2జీ కుంభకోణంలో రెండు ప్రధానమైన జడ్జిమెంట్లు మరో రెండు రోజుల్లో రానున్నాయి. అందులో మొదటిది 2జీ కేసులో హోంమంత్రి చిందబరాన్ని సీబీఐ విచారించలన్నది కాగా రెండోది అటార్నీ జనరల్ పాత్రపై విచారణకు ఆదేశించాలన్న పిటీషన్.
జస్టిస్ అశోక్ గంగూలి పదవీకాలం మే 2వ తేదీతో ముగియనున్న దరిమిలా వీటిపై మరో రెండు రోజుల్లోగా తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే... చిదంబరం తన పదవికి గుడ్ బై చెప్పక తప్పని పరిస్థితి.
కేంద్ర హోంమంత్రి చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. మరోవైపు 2జీ కేసుపై చిదంబరానికి గానీ, ప్రధానమంత్రి కార్యాలయానికి గాని సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని సమాచారం.