స్వలింగ సంపర్క సెక్స్ (గే సెక్స్)ను వ్యతిరేకిస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ గురువారం స్పష్టం చేసింది. ఒకే జాతికి చెందిన పెద్దల మధ్య స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. ఈ తరహా సెక్స్ సామాజిక పరిస్థితులకు వ్యతిరేకమని, అనైతికమని అపెక్స్ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన నైతిక, సాంఘీక విలువలు భిన్నంగా ఉంటాయని, అందువ్లల ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించలేమని అందులో స్పష్టంగా పేర్కొంది. కాగా, గత 2009 సంవత్సరంలో గే సెక్స్‌ను ఢిల్లీ హైకోర్టు చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అలాగే ఈ తరహా సెక్స్‌లో పాల్గొనడం నేరం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ తయారు చేసిన నిబంధనలను నిలివివేసింది.