జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముగిసిన ఎన్నికల మినీ సమరం : ఈనెల 6న ఓట్ల లెక్కింపు! (Election Resulrts | up | Manipure | goa Assembly | Punjab)
ఉత్తరభారతంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ శనివారంతో ముగిసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. జనవరి 28ల తేదీన ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ తెలిపారు.

ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లలో ఒకే దశలో పోలింగ్ జరుగగా, ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతుందని ఖురేషీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 403, ఉతరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, మణిపూర్‌లో 60, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల ఆరో తేదీన విడుదల కానున్నాయి.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia